మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ విడుదల
- October 12, 2024
మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం విశ్వంభర. దసరా సందర్భంగా మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ విడుదల చేసింది.
సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ మూవీలో మరోసారి చిరు తన నటనతో మెస్మరైజ్ చేశారు. టీజర్‌లో గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెగాస్టార్ మాస్ అవతార్, పవర్‌ఫుల్ డైలాగులు, గ్రాండ్ విజువల్స్‌తో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. అస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్







