అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

- October 12, 2024 , by Maagulf
అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

శబరిమల: ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు.. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

దర్శన సమయాలు

శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ మార్పుల ద్వారా భక్తులకు 17 గంటల సుదీర్ఘ సమయం దర్శనానికి లభిస్తుందని అన్నారు..

మండల పూజలు

ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26 వరకు కొనసాగుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనమిస్తుంది.

ఈసారి శబరిమలకు వచ్చే భక్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని తెలిపింది. ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకున్న భక్తులకు 48 గంటల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తారు. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com