నవదీప్ బుల్లితెరపై...
- June 21, 2016
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో అభిమానులను ఆకర్షించే విధంగా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు సీరియల్స్, వైజ్ఞానిక విషయాలు, ఎంట్రటైన్ మెంట్స్, రియాలిటీ షోలు, వార్తా విషయాలతో ప్రజలను కనువిందు చేస్తున్నాయి. ఇక ఈటీవి జబర్ధస్త్ ప్రోగ్రామ్, వీ6 తీన్మార్ లాంటి ప్రోగ్రామ్స్ తో అలరిస్తున్నారు. తాజాగా సినిమా తారలు కూడా కొన్ని సీరియల్స్ లో ఎంట్రీ ఇవ్వడం గమనిస్తున్నామం..ఇక సీరియల్స్ నటించే వారు వెండితెరపై కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నవదీప్ బుల్లితెరపై హంగామా చేయడానికి వస్తున్నాడు. ఈ కుర్ర హీరో టాలీవుడ్ లో చాలాకాలంగానే ఉన్నాడు.
తెలుగులో జై చిత్రంలో ఎంట్రీ ఇచ్చినా అది పెద్దగా హిట్ కాలేదు..తర్వాత కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాల ఇద్దరు హీరోల్లో ఒకరైన నవదీప్ అందాల భామ కాజల్ సరసన నటించాడు.
ఈ చిత్రంలో మనోడికి కాస్త మంచి పేరు వచ్చినా అది తన కెరీర్ కి మాత్రం పెద్ద ప్లస్ పాయింట్ కాలేక పోయింది. సోలో హీరోగా తెగ సినిమాలు చేసేయకపోయినా.. అవకాశాల విషయంలో కొదువేం లేదు. యాక్టర్ గా ఇప్పటికీ బిజీగానే కొనసాగుతుంటాడు. ఇప్పుడు నవదీప్ కొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటనుండడం విశేషం.
టెలివిజన్ లో ఇప్పటికే చాలామంది స్టార్లు సెటిల్ కాగా.. ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో ను హోస్ట్ చేయబోతున్నాడు. సౌతిండియాలో ఇదే అతి పెద్ద స్టంట్ రియాలిటీ షో అంటున్నారు.15మంది పార్టిసిపెంట్లు ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తుంటే.. నవదీప్ వాళ్లని సమన్వయపరుస్తాడట. ఇక్కడ కూడా నవదీప్ క్లిక్ కావడం ఖాయం అంటున్నారు
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









