కలిసి నటించనున్న సూర్య, జ్యోతిక...

- June 21, 2016 , by Maagulf
కలిసి నటించనున్న సూర్య, జ్యోతిక...

తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతికని వివాహం చేసుకున్న తర్వాత వీరికి దియా అనే పాప జన్మించిన సంగతి తెలిసిందే. సూర్యను వివాహమాడిన తర్వాత జ్యోతిక పూర్తిగా వెండి తెరకు దూరమైంది. ఇటీవల 36 వయోదినిలే అనే లేడి ఓరియెంటెడ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, తాజాగా సూర్యతో కలిసి నటించేందుకు సిద్దమైంది.జ్యోతిక రీ ఎంట్రీ మూవీ 36 వయోదినిలే మూవీని సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించగా, ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో తన తరువాతి సినిమాని కూడా ప్లాన్ చేసింది ఈ అమ్మడు. అయితే ఈ మూవీని కూడా సూర్యనే నిర్మిస్తున్నారు. తొలి చిత్రం కుట్రం కడిదల్‌తోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బ్రహ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇందులో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. 2006లో వచ్చిన ఒరు కాదల్ అనే తమిళ చిత్రంలో చివరి సారిగా కలిసి నటించిన వీరిరివురు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి నటించనుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com