మళ్ళీ రాజకీయాల్లోకి మోహన్ బాబు

- June 21, 2016 , by Maagulf
మళ్ళీ రాజకీయాల్లోకి మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మోహన్ బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి తెలిపారు. 1982 లో రాజకీయ ఆరంగేట్రం చేసిన మోహన్ బాబు టిడిపి పార్టీలో కొన్నాళ్ళు పనిచేశారు. రాజసభ్యుడిగా కూడా తన సేవలను అందించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం విశేషం.నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్ధలు ఛైర్మన్‌గా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న మోహన్ బాబు త్వరలో ఓ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్టు తెలిపారు. అయితే ఏ పార్టీ అనేది త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.
తాను ఆవేశపరుడినే కాని, అవినీతిపరుడిని కాదన్న మోహన్‌బాబు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయలకు చలించి రాజకీయాల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఏపి వారిని కేసిఆర్ ప్రోత్సహించడం అభినందనీయం అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com