కువైట్ లోని రోడ్లకు మహర్దశ.. 18 ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్..!!

- October 16, 2024 , by Maagulf
కువైట్ లోని రోడ్లకు మహర్దశ.. 18 ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్..!!

కువైట్: కువైట్ వ్యాప్తంగా హైవేలు,  ప్రధాన రహదారుల నిర్వహణ కోసం చర్యలు చేపట్టారు. ఇందు కోసం విదేశీ సంస్థలతో 18 ఒప్పందాలను చేసుకున్నారు.  ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.  సంబంధిత రాష్ట్ర సంస్థలు కువైట్ అంతటా రోడ్లను సరిచేయడానికి ఉద్దేశించిన ఒప్పందాలకు ఆమోదం తెలిపాయని  పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నోరా అల్-మషాన్ తెలియజేశారు. ఇది చరిత్రలో అపూర్వమైన ఘటనగా అభివర్ణించారు. ఈ ఒప్పందాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తాయని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com