అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి
- October 16, 2024
అమెరికా: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మన తెలుగువాళ్లు మృతి చెందారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటన చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.
దక్షిణ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులు తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నట్లు గుర్తించారు అక్కడి పోలీసులు. తీవ్రంగా గాయపడిన హరిత భర్త సాయి చెన్ను.. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







