నమ్మలేని బడ్జెట్లో ఆపిల్ ఐప్యాడ్ మిని విడుదల
- October 17, 2024
- ఆధునిక ఫీచర్లు మరియు శక్తివంతమైన A17 ప్రో చిప్‌సెట్
- 8.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే
- ఐఫోన్ 15 ప్రోలో ఉపయోగించిన A17 ప్రో చిప్‌సెట్
- ఐప్యాడ్ ప్రో మరియు ఐప్యాడ్ ఎయిర్ తరహా డిజైన్‌ను
ఆపిల్ కంపెనీ రీసెంట్ గా ఐప్యాడ్ మిని ఇటీవలే రిలీజ్ చేసింది. ఈ ఐప్యాడ్ మిని అనేక ఆధునిక ఫీచర్లతో మరియు శక్తివంతమైన A17 ప్రో చిప్‌సెట్‌తో ఈ కొత్త మోడల్‌ను ఆపిల్ అక్టోబర్ 16, 2024న భారత్‌లో విడుదల చేసింది. ఈ ఐప్యాడ్ మినిలో 8.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ఇది చాలా స్పష్టమైన కలర్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 15 ప్రోలో ఉపయోగించిన A17 ప్రో చిప్‌సెట్ నే దీనిలో ప్రవేశపెట్టారు. ఈ చిప్‌సెట్ వలన ఐప్యాడ్‌ను చాలా వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
డిజైన్ పరంగా, ఈ ఐప్యాడ్ మిని చాలా సన్నగా మరియు పోర్టబుల్‌గా ఉంటుంది. ఫ్లాట్ సైడ్స్‌తో, ఇది ఐప్యాడ్ ప్రో మరియు ఐప్యాడ్ ఎయిర్ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఆపిల్ పెన్సిల్ ప్రోను సపోర్ట్ చేస్తుంది, ఇది క్రియేటివ్ వర్క్ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కెమెరా విభాగంలో, ఈ ఐప్యాడ్ మినిలో వెనుకవైపు 12MP వైడ్ కెమెరా మరియు ముందువైపు 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు సెంటర్ స్టేజ్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి, ఇది వీడియో కాల్స్ సమయంలో ఫ్రేమ్ మధ్యలో ఉండేలా చేస్తుంది.
స్టోరేజ్ పరంగా, ఈ ఐప్యాడ్ మిని 128GB మరియు 256GB వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే, Wi-Fi వేరియంట్ ధర రూ.49,900 మరియు Wi-Fi + సెల్యూలర్ మోడల్ ధర రూ.64,900 గా ఉంది. విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
ఈ ఐప్యాడ్ మిని బ్లూ, పర్పుల్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఇది పోర్టబుల్ డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, మరియు ఆధునిక కెమెరా ఫీచర్లతో, అన్ని వర్గాల వినియోగదారులకు అనువుగా ఉంటుంది. ఈ కొత్త ఐప్యాడ్ మినిని మీరు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు మరియు అక్టోబర్ 23 నుండి సేల్ ప్రారంభం కానుంది.
ఆపిల్ ఐప్యాడ్ మిని ఎవరికి ఉపయోగకరమంటే విద్యార్థులు, ప్రొఫెషనల్స్, మరియు సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ఐప్యాడ్ మిని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నోట్స్ తీసుకోవడం, ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ చేయడం, మరియు ఎడ్యుకేషనల్ యాప్స్ ఉపయోగించడం కోసం అనువుగా ఉంటుంది. ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ ఉండటం వల్ల, విద్యార్థులు సులభంగా డ్రాయింగ్ చేయవచ్చు మరియు డిజిటల్ నోట్స్ రాసుకోవచ్చు.
ప్రొఫెషనల్స్ కోసం, ఈ ఐప్యాడ్ మిని ఒక శక్తివంతమైన టూల్. ఇది ఈమెయిల్స్ చెక్ చేయడం, ప్రెజెంటేషన్లు తయారు చేయడం, మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఉపయోగించవచ్చు. A17 ప్రో చిప్‌సెట్ వల్ల, ఇది చాలా వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. క్రియేటర్స్ కోసం, ఈ ఐప్యాడ్ మిని ఒక అద్భుతమైన పరికరం. ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, మరియు డిజిటల్ ఆర్ట్ కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 12MP కెమెరా మరియు సెంటర్ స్టేజ్ ఫీచర్ వల్ల, వీడియో కాల్స్ మరియు ఫోటోగ్రఫీ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.
మార్కెట్లో.. ఇదే ప్రైస్ రేంజ్ బడ్జెట్లో ఐప్యాడ్ మినికి అనేక కాంపిటేటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా, సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 మరియు S8, మరియు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 3 వంటి టాబ్స్ ఈ ఐప్యాడ్ మినికి ప్రధాన పోటీదారులు ఉన్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 మరియు S8 కూడా శక్తివంతమైన ప్రాసెసర్లతో మరియు అధునాతన డిస్‌ప్లే ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇవి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి మరియు అనేక యాప్స్ మరియు గేమ్స్ సపోర్ట్ చేస్తాయి. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 3 కూడా ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది మరియు ప్రొఫెషనల్ వర్క్ కోసం అనువుగా ఉంటుంది. ఈ గ్యాడ్జెట్స్ ఐప్యాడ్ మినితో సమానమైన ధరలో లభిస్తాయి మరియు వినియోగదారుల అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి