'కుందనపు బొమ్మ'ను జూన్‌ 24న విడుదల

- June 22, 2016 , by Maagulf
'కుందనపు బొమ్మ'ను జూన్‌ 24న విడుదల

'నా అల్లుడు', 'విశాఖ ఎక్స్‌ప్రెస్‌' చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ముళ్లపూడి వరా. పల్లెటూరి నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం 'కుందనపు బొమ్మ'. సుధాకర్‌ కోమకుల, సుధీర్‌వర్మ, చాందినిచౌదరిలు ప్రధాన ప్రాతలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. మనవైన భావోద్వేగాలు, స్వచ్ఛమైన హస్యంతో సాగే చిత్రమని దర్శకుడు పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'కుందనపు బొమ్మ'ను జూన్‌ 24న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com