గజల్ శ్రీనివాస్ ఆడియోలను ఆవిష్కరించిన జ్యోతిర్ మఠ్ శంకరాచార్య..

- October 17, 2024 , by Maagulf
గజల్ శ్రీనివాస్ ఆడియోలను ఆవిష్కరించిన జ్యోతిర్ మఠ్ శంకరాచార్య..

తిరువనంతపురం: డా.గజల్ శ్రీనివాస్ స్వరపరచి, గానం చేసిన పోతన విరచిత భాగవతం లోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్  జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) శ్రీ పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన  అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు. మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమము అని,  వీటిని  స్వరపరచి సందర్భ ,తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు.ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్ లకు స్వామి వారు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com