కరామా నివాసితుల్ని భయపెట్టిన పేలుడు

- June 22, 2016 , by Maagulf
కరామా నివాసితుల్ని భయపెట్టిన పేలుడు



కరామాలోని ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌లో సంభవించిన పేలుడుతో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పలు కార్లు, పక్కనే ఉన్న కొన్ని దుకాణాలు, అపార్ట్‌మెంట్లు ఈ పేలుడు ఘటనలో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడని చెప్పారు. ఉస్తాద్‌ హోట్‌లో గ్యాస్‌ సిలెండర్‌ పేలుడే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు. పేలుడు సంభవించిన వెంటనే ఆ రెస్టారెంట్‌ ఉన్న అల్‌ మస్కాన్‌ బిల్డింగ్‌లో గల సాధారణ ప్రజలు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేశారు. అల్‌ మస్కాన్‌ బిల్డింగ్‌లో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై నిలిపిన వాహనాలు కూడా ధ్వంసమయినట్లు అధికారులు వివరించారు. సమీపంలో ఉన్న భవనాల్లోనివారు భూకంపం వచ్చిందా? అన్న భయానికి లోనయ్యామని చెప్పారు. ప్రమాద కారణాల్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులు, టేస్టీ ఫుడ్‌ విషయంలో వినియోగదారుల మన్ననల్ని అందుకుంటున్నారు ఎంతో కాలంగా. అలాగే సామాజిక సేవా కార్యక్రమంలోనూ నిర్వాహకులు ముందుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com