18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసిన ఎఫ్‌బీఐ
- June 22, 2016
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించిన 18 ఏళ్ల యువకుడిని ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అరెస్టు చేసింది. నిందితుడిని అక్రమ్ ముస్లెహ్గా అధికారులు గుర్తించారు. ఇండియానాపోలిస్ నుంచి న్యూయార్క్‌కు బస్సులో వెళ్తుండగా అధికారులు అరెస్టు చేశారు. అతను మొరాకో మీదుగా ప్రయాణించి ఐఎస్ ఆధీనంలో ఉన్న ప్రాంతానికి వెళ్లడానికి ప్రణాళిక రచించుకున్నట్లు తెలిపారు. నిందితుడు ఐఎస్‌లో చేరి ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకే విదేశీ ప్రయాణం చేస్తున్నట్లు అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ పీ కార్లిన్ తెలిపారు. .
తీవ్రవాద సంస్థకు మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై న్యాయశాఖ చర్యలు తీసుకుంటోందని కార్లిన్ అన్నారు.
ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థల వల్ల స్థానిక, విదేశాల్లో నివసించే అమెరికా పౌరులకు ముప్పు ఉందని వారిని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉందని యూఎస్ అటార్నీ జోష్ మింక్లర్ తెలిపారు. అక్రమ్ దోషిగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష.. 2,50,000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







