సౌదీ లోకలైజేషన్..2024లో 364000 సౌదీలకు ఉద్యోగాలు..!!
- October 22, 2024
రియాద్: 2024లో తొలిసారిగా 364000 మంది సౌదీ పౌరులు స్థానిక ఉపాధి మార్కెట్లో చేరారని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి ఇంజినీర్ అహ్మద్ అల్-రాజీ తెలిపారు. రియాద్‌లో జరిగిన గ్లోబల్ హెల్త్ ఎగ్జిబిషన్ మొదటి డైలాగ్ సెషన్లో మంత్రి ప్రసంగించారు. గత నాలుగేళ్లలో అకౌంటింగ్, ఫార్మసీ, రేడియాలజీ తదితర వృత్తులతో ఉద్యోగాలను స్థానికీకరించేందుకు మొత్తం 50 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సౌదీ యువకులు, మహిళలు ఆరోగ్య రంగంలో తమ అధిక సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారని అల్-రాజి చెప్పారు. సౌదీ అరేబియాలో మొత్తం నిరుద్యోగిత రేటు 3 శాతానికి చేరుకుందని, సౌదీలలో నిరుద్యోగం రేటు 7 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. ఐదేళ్ల క్రితం లేబర్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువగా ఉందని, నేడు విజన్ 2030 లక్ష్యాన్ని మించి 35 శాతంగా ఉంది." అని ఆయన తెలిపారు. లాభాపేక్షలేని రంగం చాలా ముఖ్యమైనదని, దేశ ఆశయాలను సాధించేందుకు ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని అల్-రాజీ అన్నారు. మూడేళ్ళలో లాభాపేక్ష లేని సంస్థల వృద్ధి రేటు 150 శాతానికి చేరుకుందన్నారు. సంస్థల సంఖ్య 5,000 సంస్థలకు చేరుకుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







