ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో దుబాయ్, అబుదాబి..!!
- October 22, 2024
యూఏఈ: ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్ గల నిపుణులను ఆకర్షించడంలో దుబాయ్, అబుదాబిలు మొదటి స్థానంలో నిలిచాయి. కెర్నీ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌లో మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా (మేనా) ప్రాంతంలో దుబాయ్ అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానంలో ఉంది. వరుసగా నాల్గవ సంవత్సరం కూడా టాప్ 25లో స్థానం పొందింది. దుబాయ్, అబుదాబిలతోపాటు సౌదీ అరేబియాలోని రియాద్, దమ్మామ్ నగరాలు జాబితాలో స్థానం పొందాయి. మధ్యప్రాచ్యంలోని నగరాలు బలమైన ఆర్థిక వ్యవస్థలు, ఆకర్షణీయమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, ఆర్థిక వృద్ధిలో అపారమైన అవకాశాలను కలిగి ఉన్నాయని నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్స్టిట్యూట్లో కీర్నీ భాగస్వామి రుడాల్ఫ్ లోహ్మేయర్ తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లో దుబాయ్, మక్కా, మస్కట్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దుబాయ్ ఇన్నోవేషన్‌లో 10-ర్యాంక్ పెరుగుదలను నమోదుచేయగా.. మక్కా ఎనిమిది ర్యాంక్‌లు మెరుగుపడింది. ఇక మస్కట్ 11 ర్యాంకులను మెరుగుపరుచుకొని జాబితాలో చోటు సంపాదించుకుందని సర్వే నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







