ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికీకరణ చట్టం.. ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- October 23, 2024
దోహా: ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలను స్థానికీకరించడంపై చట్టాన్ని ఉల్లంఘించిన సంస్థలు లేదా వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, QR1,000,000 వరకు జరిమానా విధించనున్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చట్టంలోని ఆర్టికల్ (11) ప్రకారం.. నిర్ణీత వ్యవధిలో ఉల్లంఘనను సరిచేసుకోని సంస్థల లావాదేవీలను 3 నెలల కాలానికి రద్దు చేస్తారు. ఆర్టికల్ (12) ప్రకారం.. మోసపూరిత విధానాలకు పాల్పడే వారికి 3 సంవత్సరాల జైలుశిక్షతోపాటు QR1,000,000కు జరిమానా విధించనున్నట్లు మంత్రిత్వశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. లోకలైజేషన్ చట్టం ప్రకారం.. అందుబాటులో ఉన్న ఉద్యోగాల గురించి తెలియజేయకపోవడం, నియమించిన వారి డేటాను అధికారులకు అందించకపోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే మొదటిసారి ఉల్లంఘన జరిగినప్పుడు QR10,000, రెండవసారి జరిగినప్పుడు QR 20,000, మూడోసారి జరిగితే QR30,000 జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా పునరావాసం, శిక్షణా ప్రణాళికకు కట్టుబడి ఉండని పక్షంలో మొదటి సారి పెనాల్టీ QR50,000, రెండవ ఉల్లంఘనకు QR75,000, మూడవసారి జరిగితే QR100,000 ఫైన్ విధిస్తారు. ఈ చట్టం అధికారిక గెజిట్లో ప్రచురించబడిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత అమలులోకి వస్తుందని వెల్లడించింది. ఈ చట్టం ఖతార్ జాతీయ విజన్ 2030కి అనుగుణంగా తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం







