కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం

- October 23, 2024 , by Maagulf
కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం

విజయవాడ: కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం ఎన్నికయింది. అసోసియేషన్ ఎన్నిక ప్రక్రియ ప్రకారం గత నెల నుండి నూతన కార్యవర్గం కోసం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి ప్రక్రియ ప్రారంభించారు. వివిధ దశల్లో నామినేషన్లను పరిశీలించి కేడీసీఏ మెమొరండమ్ ఆఫ్ అసోసియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలోని ప్రతి పోస్ట్ కి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో వీరి ఎంపిక ఏకగ్రీవమయింది.

ఈ నేపథ్యంలో కేడీసీఏ ఎన్నికల అధికారి డాక్టర్ ఏ వెంకటరత్నం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి ఎంపీ కేశినేని శివనాద్ శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.

నూతన కార్యవర్గం…

కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పొట్లూరు శ్రీనివాస్ చౌదరి ఎంపిక కాగా, ఉపాధ్యక్షుడిగా బండారు శ్రీనివాసరావు, కార్యదర్శిగా మేడసాని రవీంద్ర చౌదరి ఎన్నికయ్యారు, అలాగే జాయింట్ సెక్రెటరీగా వి రజనీకాంత్ ఎన్నిక కాగా ట్రెజరర్ గా మొహమ్మద్ సాదిక్, కౌన్సిలర్ గా పి బాజీ షరీఫ్ ఖాన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com