గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియాకు రూ.6 కోట్ల 45 లక్షల విడుదల
- October 23, 2024
◉ 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో 160 మంది తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా
హైదరాబాద్: తెలంగాణ ముఖమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21న రూ.6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. నిధుల విడుదలకు సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
గల్ఫ్ మృతుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు రూ.1 కోటి 75 లక్షలు, జగిత్యాలకు రూ.1 కోటి 40 లక్షలు, రాజన్న సిరిసిల్లకు రూ.60 లక్షలు, నిర్మల్ కు రూ.50 లక్షలు, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ఆదిలాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్ జిల్లాకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారని వారు తెలిపారు.
2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో 160 మంది తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా.గల్ఫ్ మృతుల సంఖ్యను బట్టి అన్ని జిల్లాలకు తగిన నిధులు విడుదల చేస్తారని ఇందుకోసం మొత్తంగా రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయించారని వినోద్ కుమార్, భీంరెడ్డి తెలిపారు.

తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







