దుబాయ్ మెట్రో ఛాలెంజ్..Dh10,000 నగదు బహుమతి, 50gm బంగారం గెలుచుకోండి..!!
- October 25, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నవంబర్ 1న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేని జరుపుకుంటున్నది. దుబాయ్లో వివిధ ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించే ప్రయాణికులు 1 మిలియన్ Nol+ పాయింట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు 'మిస్టిరియస్ మ్యాన్ ఛాలెంజ్' విజేతలకు విలువైన నగదు బహుమతులు కూడా అందజేయనున్నారు. అదృష్ట విజేతకు Dh10,000 నగదు బహుమతితో పాటు 50 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. అక్టోబర్ 28 నుండి ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని RTA అనేక కార్యకలాపాలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. ప్రజా రవాణా దినోత్సవాన్ని ఏటా నవంబర్ 1న జరుపుకుంటారు. RTA ఆరు కేటగిరీలలో ప్రజా రవాణా వినియోగదారులకు బహుమతులు అందజేస్తుంది.ప్రతి వర్గం నుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తుంది.ప్రతి ఒక్కరికి 'పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛాంపియన్' బిరుదుతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







