హైదరాబాద్: నకిలీ ఐఫోన్లు అమ్ముతున్న నలుగురు అరెస్ట్
- October 26, 2024
హైదరాబాద్: చైనా ఫోన్లకు స్టిక్కర్లు వేసి ఐఫోన్లుగా అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో అబిడ్స్ జగదీష్ మార్కెట్లో నకిలీ ఐఫోన్లు అమ్ముతున్న నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జగదీష్ మార్కెట్లో చైనా ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు మొబైల్ షాప్స్ మీద రైడ్ చేశారు. ఇందులో రూ.3 కోట్ల విలువైన నకిలీ ఐఫోన్ పరికరాలను చేసుకున్న పోలీసులు.. స్టిక్కర్లు మార్చి ఐఫోన్లుగా అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా నిందితులు మోసానికి పాల్పడి అమాయకుల నుండి కోట్ల రూపాయలు దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల