అల్ వాత్బా రిజర్వ్ లోకి చొరబాటు.. నిందితులకు Dh165,000 జరిమానా..!!
- October 26, 2024
యూఏఈ: అబుదాబిలో అనేక మంది వ్యక్తులు ప్రకృతి రిజర్వ్‌లోకి ప్రవేశించి, జంతువుల ఆవాసాలను దెబ్బతీసినందుకు Dh165,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ అబుదాబి (EAD) అల్ వత్బాలోని రక్షిత ప్రాంతాలలో ఒకదానిలో ఉల్లంఘనను గుర్తించినట్లు తెలిపింది. ఈ వ్యక్తులు అనుమతి లేకుండా అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. అల్ వత్బా అనేది ఎమిరేట్ కొన్ని విలువైన సహజ సంపదలకు నిలయంగా ఉన్నది. అల్ వాత్బా వెట్‌ల్యాండ్ రిజర్వ్ వేసవిలో వేలాది ఫ్లెమింగోలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ ప్రాంతంలో శాశ్వతంగా నివసించే అనేక జాతులతో పాటు.. ఈ రక్షిత ప్రాంతంలో సుమారు 120,000 సంవత్సరాల క్రితం నుండి శిలాజ సంపద ఉన్నట్లు గుర్తించారు. మనమందరం పర్యావరణ చట్టాలకు కట్టుబడి ఉండాలని, భవిష్యత్ తరాలకు మన సహజ వనరులను అందించేందుకు ముందుకు రావాలని, మెరుగైన పర్యావరణం కోసం పని చేయాలని EAD పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







