మనాహ్‌లో ఒమానీ యువజన దినోత్సవ వేడుకలు..!!

- October 26, 2024 , by Maagulf
మనాహ్‌లో ఒమానీ యువజన దినోత్సవ వేడుకలు..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 26న ఒమానీ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది.  అల్ దఖిలియా గవర్నరేట్‌లోని మనాహ్‌లోని ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియంలో ఈ సందర్భంగా జరగనున్న వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ హాజరవుతారు. ఈ వేడుకలో 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఒమానీ యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అధికార యంత్రాంగం పేర్కొంది. యూత్ సెంటర్ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 110,361 వేల మంది ప్రయోజనం పొందారు. ఇందులో 101,600 వేల మంది యువకులు ఉన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com