ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. టెహ్రాన్‌లో పేలుళ్లు..!!
- October 26, 2024
టెహ్రాన్: ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై తమ సైన్యం "ఖచ్చితమైన దాడులను" అమలు చేసిందని ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున ప్రకటించింది. టెహ్రాన్‌లో పేలుళ్లు వినిపించాయని స్థానికులు కూడా సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు. "ప్రస్తుతం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తోంది" అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మ్ డానియల్ హగారి తెలిపారు.
ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో ప్రకారం.. అనేక ఇజ్రాయెల్ విమానాలు టెహ్రాన్, మషాద్, కరాజ్‌లోని పవర్ స్టేషన్‌తో సహా వివిధ ప్రదేశాలపై దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ రాజధానిలో పేలుళ్లు విన్నట్లు ఇరాన్ సెమీ-అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించగా, సిరియన్ వార్తా సంస్థ సనా డమాస్కస్‌లో పేలుళ్లకు సంబంధించిన ఇలాంటి నివేదికలను ధృవీకరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల