మోక్షజ్ఢ‌తో జోడీ కట్టబోయే ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

- October 26, 2024 , by Maagulf
మోక్షజ్ఢ‌తో జోడీ కట్టబోయే ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ‘హనుమాన్’తో పాపులర్ అయిన యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఢ డెబ్యూ మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాలో మోక్షజ్ఢతో జోడీ కట్టబోయే హీరోయిన్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆమె మరెవరో కాదు, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా టడాని.
ఈ ముద్దుగుమ్మ తెరంగేట్రం గురించి కూడా గత కొన్ని రోజులుగా పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయ్. ఫైనల్‌గా నందమూరి నట వారసుడితో డెబ్యూ చేయనున్నట్లు తాజాగా ప్రచారం జోరందుకుంది.
లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ సినిమాని ప్రశాంత్ వర్మ చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు.
ఎప్పటి నుంచో మోక్షజ్ఢ తెరంగేట్రం కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది.
సో, డెబ్యూ మూవీ కావడం.. ఎన్నో అంచనాలతో వారసుడి ఎంట్రీ జరుగుతుండడం.. ఈ కారణాల వల్ల ఈ సినిమాపైనా ప్రశాంత్ వర్మ టేకింగ్ పైనా భారీ అంచనాలున్నాయ్. చూడాలి మరి, ఆ అంచనాల్ని ప్రశాంత్ వర్మ ఎలా నిలబెట్టుకుంటాడో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com