హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు
- October 28, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. నగరంలో నిన్నటి నుండి (ఈనెల 27)న సాయంత్రం 6 గంటల నుండి వచ్చే నెల 28 వరకు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వబడబోదు. అనుమతులు లేకుండా నిర్వహించే ర్యాలీలు, సమావేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సభ్యుల సంఖ్య ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను పరామర్శించమని అన్నారు.
బీఎన్ఏస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులు జారీ చేయబడినాయి. అయితే, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు, ధర్నాలకు అనుమతి ఇచ్చినట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో నిరసన కార్యక్రమాలను నిషేధించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







