రాజ్యాంగ సవరణల ముసాయిదాను ఆమోదించిన షురా కౌన్సిల్..!!

- October 29, 2024 , by Maagulf
రాజ్యాంగ సవరణల ముసాయిదాను ఆమోదించిన షురా కౌన్సిల్..!!

దోహా: రాజ్యాంగ సవరణల ముసాయిదాను  స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్ అధ్యక్షతన సమావేశమైన షూరా కౌన్సిల్ ఆమోదించింది. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్‌ల సవరణను అధ్యయనం చేసే ప్రత్యేక కమిటీ నివేదికను సమీక్షించిన తర్వాత షురా కౌన్సిల్ ముసాయిదా రాజ్యాంగ సవరణలను ఏకగ్రీవంగా ఆమోదించింది. షూరా కౌన్సిల్ సభ్యులు జాతీయ ఐక్యతను పెంపొందించడానికి, న్యాయ సూత్రాన్ని, చట్ట నియమాలకు మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా షురా కౌన్సిల్ స్పీకర్ హెచ్‌ఇ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్ తన చారిత్రాత్మక ప్రసంగంలో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సవరణలు జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంలో.. చట్టబద్ధమైన పాలనను సమర్థించడంలో ముఖ్యమైన దశను సూచిస్తాయని ఆయన అన్నారు. ప్రజల ఐక్యతను కాపాడటం, హక్కులు విధుల పరంగా సమాన పౌరసత్వాన్ని పెంపొందించడం ఈ సవరణల లక్ష్యమని తెలిపారు.  ముసాయిదా రాజ్యాంగ సవరణలలో ఆర్టికల్స్ (1), (7), (13), (74), (77), (80), (81), (83), (86), (103), ఖతార్ రాష్ట్ర శాశ్వత రాజ్యాంగంలోని (104), (114), (117),  (150) ఆర్టికల్ (75 బిస్), ఆర్టికల్ (125/చివరి పేరా), (78) , (79), (82)  ఆర్టికల్‌లను రద్దు చేయనున్నారు. వాటి స్థానంలో కొత్త వివరణలను జోడించనున్నారు. వీటిపై లోతైన సమీక్ష చేయాలని నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com