యూఏఈలో దీపావళి.. కొన్ని పాఠశాలల్లో 5 రోజులపాలు సెలవులు..!!
- October 29, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో దీపావళి వేడుకలను పురస్కరించుకొని అనేక భారతీయ స్కూల్స్ సెలవులు ప్రకటించాయి. కొన్ని స్కూల్స్ ఐదు రోజులపాటు సెలవులు ప్రకటించాయి. దక్షిణాసియాలో అతిపెద్ద పండుగలలో ఒకటైన దీపావళిని జరుపుకునేందుకు యూఏఈలోని కొన్ని పాఠశాలలు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించాయి. వీకెండ్ శనివారం, ఆదివారంతో కలిపి నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. మరికొన్ని పాఠశాలలు బుధవారం రోజున కూడా సెలవు ప్రకటించాయి. ఈ సంవత్సరం దీపావళి ఉత్సవాలు అక్టోబర్ 29 న ధన్తేరస్‌తో ప్రారంభమవుతాయి. అయితే ప్రధాన దీపావళి వేడుక అక్టోబర్ 31న(గురువారం) జరుగుతుంది. అమిటీ స్కూల్ దుబాయ్‌లో ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దీపావళి సందర్బంగా 5 రోజుల సుదీర్ఘ దీపావళి సెలవులు (అక్టోబర్ 31 నుండి నవంబర్ 4 వరకు) ప్రకటించారని తెలిపారు. అయితే, దుబాయ్‌లోని సెలవులను ప్రకటించాలంటే..ముందుగా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) తెలిపి ఆమోదించుకోవాలి. షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 31, నవంబర్ 1న దీపావళి సెలవులు ప్రకటించినట్టు తెలిపారు. స్టూడెంట్స్ లాంగ్ వీకెండ్‌ని పొందుతున్నారు. అక్టోబరు 30న రంగోలీ పోటీని ప్లాన్ చేసామని, తర్వాత ఖమాన్ ధోక్లా, గులాబ్ జామూన్, సమోసా వంటి కొన్ని భారతీయ స్నాక్స్ తో సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, గాజా, లెబనాన్‌లో నెలకొన్న సంక్షోభాల కారణంగా ఈ సారి పరిమితంగానే దీపావళి వేడుకలను పరిమితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







