సౌదీ-ఎమిరాటీ ఎకనామిక్ ఫోరమ్.. SR111 బిలియన్లకు పెరిగిన ఎమిరాటీ పెట్టుబడులు..!!
- October 29, 2024
రియాద్: సౌదీ-ఎమిరాటీ ఎకనామిక్ ఫోరమ్ మూడవ ఎడిషన్‌ను సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్ రియాద్‌లో నిర్వహించింది. ఇందులో ఆర్థిక మంత్రి ఫైసల్ అల్-ఇబ్రహీం, పరిశ్రమల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ పాల్గొన్నారు. సౌదీ అరేబియాలో ప్రత్యక్ష ఎమిరాటీ పెట్టుబడుల పరిమాణం SR111 బిలియన్లు అని అల్-ఇబ్రహీం నివేదించారు. తన ప్రసంగంలో రెండు దేశాల మధ్య వాణిజ్య మార్పిడి 25% పెరిగి SR113 బిలియన్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో యూఏఈకి సౌదీ ఎగుమతులు 2018 నుండి 2023 వరకు 9% కంటే ఎక్కువ వార్షిక రేటుతో వృద్ధి చెందాయని, 2024లో మొత్తం SR31 బిలియన్లకు చేరుకుందని పరిశ్రమల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక, మైనింగ్ రంగాలలో ఇంకా పెట్టుబడులు పెరగాలని ఆకాంక్షించారు. అంతకుముందు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా అల్ మర్రి నేతృత్వంలోని 100కి పైగా ప్రధాన కంపెనీల ఎమిరాటీ వాణిజ్య ప్రతినిధి బృందాన్ని ఫోరమ్ స్వాగతించింది,.వీరితో పాటు ఇరు దేశాల నుండి అనేక మంది అధికారులు, పెట్టుబడిదారులు ఉన్నారు. మొదటి ఫోరమ్ 2018లో అబుదాబిలో జరిగింది. రెండోది 2019లో రియాద్‌లో జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







