దుబాయ్ లో అద్దెలు, ప్రాపర్టీ ధరలు స్థిరం.. సంక్షోభ ప్రభావం లేదు..S&P గ్లోబల్‌ నివేదిక..!!

- October 29, 2024 , by Maagulf
దుబాయ్ లో అద్దెలు, ప్రాపర్టీ ధరలు స్థిరం.. సంక్షోభ ప్రభావం లేదు..S&P గ్లోబల్‌ నివేదిక..!!

యూఏఈ: దుబాయ్‌లో ప్రాపర్టీ ధరలు,  అద్దెలు రాబోయే 18 నెలల్లో స్థిరంగా ఉంటాయి. అదే సమయంలో మహమ్మారి తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త ప్రాజెక్ట్ లాంచ్‌ల నేపథ్యంలో సరఫరా పెరగడం వల్ల ధరలుకొద్దిగా తగ్గుముఖం పట్టవచ్చని S&P గ్లోబల్‌ తన నివేదికలో వెల్లడించింది.  అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ జారీ చేసిన ఈ నివేదిక .. దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ స్థిరంగా ఉంటుందని, స్థానిక మార్కెట్‌పై ప్రాంతీయ భౌగోళిక రాజకీయ సంఘర్షణ ప్రభావం లేదని పేర్కొంది.  స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుండి డిమాండ్ ఉందని, అనేక వీసా సంస్కరణలు కూడా కలిసి వచ్చాయని తెలిపింది. 

2025లో అందుబాటులో ఉన్న యూనిట్ల స్టాక్ మొదట నాన్-ప్రైమ్ ఏరియాల్లో,  తర్వాత విస్తృత మార్కెట్‌కు పెరగడంతో అద్దె వృద్ధి స్థిరంగా ఉంటుందని పేర్కొంది. “ప్రాపర్టీ ధరలు రాబోయే 18 నెలల్లో స్థిరంగా ఉంటాయి.  పెరుగుతున్న సరఫరా కారణంగా కొద్దిగా తగ్గవచ్చు. 2022-2023లో ముందస్తుగా విక్రయించబడిన పెద్ద సంఖ్యలో ప్రాపర్టీలు డెలివరీ అవుతాయని, 2025-2026లో రెసిడెన్షియల్ సప్లై స్టాక్ సుమారు 182,000 యూనిట్లు పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. 2019-2023లో సంవత్సరానికి డెలివరీ అయిన సగటు 40,000 యూనిట్ల కంటే ఇది చాలా ఎక్కువ.” అని S&P గ్లోబల్‌లోని ప్రైమరీ క్రెడిట్ అనలిస్ట్ సప్నా జగ్తియాని అన్నారు.

2026 నాటికి దుబాయ్ జనాభా 4 మిలియన్లకు చేరుతుందని S&P గ్లోబల్ అంచనా వేసింది.  రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధిని పెంచడానికి..ఈ రంగంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి దుబాయ్ D33 ఎజెండాను ప్రారంభించింది. "దుబాయ్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, సుదీర్ఘమైన, ప్రత్యక్ష ఇజ్రాయెల్/US-ఇరాన్ వివాదం తలెత్తదని మేము భావిస్తున్నాము. 2023లో 3.3 శాతం వృద్ధిని అనుసరించి, 2024-2027లో వాస్తవ GDP వృద్ధి సగటున 3 శాతానికి దగ్గరగా ఉంటుందని,  2024లో దుబాయ్ తలసరి GDP సుమారు $38,000గా ఉంటుందని మేము భావిస్తున్నాము" అని S&P తన నివేదికలో తెలిపింది.

ప్రాపర్టీ మానిటర్ సెప్టెంబరు నివేదిక ప్రకారం.. కొత్త ఆఫ్-ప్లాన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ లాంచ్‌లు రికార్డు గరిష్ఠ స్థాయిలలో ఉన్నాయి. కేవలం 13,500 ఆఫ్-ప్లాన్ యూనిట్లు మార్కెట్‌లో అమ్మకానికి వచ్చాయి. అమ్మకాల విలువ Dh28.9 బిలియన్లుగా ఉంది. మొదటి 9 నెలల్లో, కొత్త ప్రాజెక్ట్ లాంచ్‌లు 100,000 యూనిట్ల కంటే కొంచెం తక్కువగా,  మొత్తం అమ్మకాల విలువలో Dh242.7 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2023లో ప్రారంభించిన యూనిట్ల పరిమాణాన్ని అధిగమించింది. అయితే, అమ్మకాల విలువలో Dh30 బిలియన్ల తగ్గింది. 2025లో లగ్జరీ డెవలప్‌మెంట్‌ల వాటా తగ్గుతుందని S&P అంచనా వేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com