ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఇకపై నో OTP!

- October 29, 2024 , by Maagulf
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఇకపై నో OTP!

న్యూ ఢిల్లీ: సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మరియు బ్యాంక్ ఫ్రాడ్‌లను అరికట్టేందుకు OTP లను నిలిపివేసి వాటి స్థానంలో మరో కొత్త టెక్నాలజీని తీసుకురావాలని కేంద్రం ప్రభత్వం ప్లాన్ చేస్తోంది.

అదే జరిగితే నవంబర్ 2024 నుండి వినియోగదారులకు OTPలు అందకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ మార్పు కారణంగా వల్ల ఆన్‌లైన్ చెల్లింపులు మరియు డెలివరీలు ప్రభావితమవుతాయి. 

ఈ మార్పు ఎందుకు జరుగుతుందంటే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ నిబంధనల ప్రకారం, బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు మరియు ఇతర ఆర్థిక సంస్థలు పంపే సందేశాలను ట్రాక్ చేయాలి. ఈ నిబంధనలు పాటించకపోతే, OTPలు మరియు ఇతర ముఖ్యమైన సందేశాలు వినియోగదారులకు చేరవు. ఈ మార్పు వల్ల బ్యాంకులు మరియు ఇతర సంస్థలు తమ సాంకేతిక పరిష్కారాలను నవీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతుందని టెలికాం సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

అయితే ఇది వినియోగదారులకు పెద్ద సమస్యగా మారవచ్చు, ఎందుకంటే OTPలు లేకుండా ఆన్‌లైన్ చెల్లింపులు మరియు డెలివరీలు సాధ్యం కాదు.ఈ సమస్యను పరిష్కరించడానికి TRAI మరియు టెలికాం సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది.అయితే ఇది ప్రస్తుతానికి ప్రతిపాదన దశలో ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com