ఒమన్ లో గుండె జబ్బుల పురోగతిపై ప్రపంచ సదస్సు

- November 01, 2024 , by Maagulf
ఒమన్ లో గుండె జబ్బుల పురోగతిపై ప్రపంచ సదస్సు

మస్కట్: ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా యూరోపియన్ కార్డియాలజీ అసోసియేషన్ సహకారంతో మస్కట్లో రెండు రోజుల శాస్త్రీయ సదస్సును ఒమన్ హార్ట్ అసోసియేషన్ ఈరోజు ప్రారంభించింది. ఈ సదస్సులో గుండె జబ్బుల నిర్ధారణ, చికిత్స మరియు నివారణలో తాజా పురోగతుల గురించి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మరియు యూరోపియన్ దేశాల నుండి 400 మంది కార్డియాలజీ నిపుణులు చర్చించనున్నారు. గుండె జబ్బులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, వైద్యులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారు. 

ఒమాన్ హార్ట్ అసోసియేషన్ ఛైర్మన్ మరియు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సేలం బిన్ నాసర్ అల్ మస్కారి, సదస్సు యొక్క ప్రాథమిక లక్ష్యాలను వివరించారు. “ఈ సమావేశం గుండె జబ్బులు మరియు వాటి చికిత్సకు సంబంధించిన మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. మొదట, అధిక రక్తపోటు మరియు దాని చికిత్సలో తాజా పరిణామాలు చర్చించబడతాయి. రెండవది, గుండె వైఫల్యంపై ప్రత్యేక దృష్టి సారించి, రోగుల జీవితాలను మెరుగుపరచడానికి తాజా చికిత్స పద్ధతులు మరియు విధానాలను పరిచయం చేస్తుంది. మూడవది, గుండె జబ్బులకు కారణమయ్యే ద్వితీయ వ్యాధులు మరియు వాటిని ఎలా నివారించాలి లేదా నియంత్రించాలి అనే అంశాలను పరిశీలిస్తుంది.” ఆరోగ్య సంరక్షణలో అవగాహన పెంచడం, సమర్థవంతమైన నివారణ మరియు చికిత్సపై కమ్యూనిటీకి అవగాహన కల్పించడం అసోసియేషన్ యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన ఆయన తెలిపారు.

 

ఈ సదస్సు గుండె జబ్బులపై వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు అధిక రక్తపోటు మరియు హార్ట్ ఫెయిల్యూర్స్ ని నిర్మూలించడానికి కృషి చేస్తుంది. ఇంకా సదస్సులో పాల్గొనే నిపుణులు గుండె జబ్బులకు దోహదపడే ద్వితీయ వ్యాధులపై దృష్టి పెడతారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు గుండె సంబంధిత పరిస్థితుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి నివారణ వ్యూహాలను అన్వేషిస్తారు. ఈ సదస్సు గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచడమే కాకుండా, కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com