దుబాయ్ లో కొత్త ఆర్థిక చట్టాలు..ట్రావెల్ బ్యాన్, ప్రాపర్టీ సీజ్..!!
- November 01, 2024
యూఏఈ: దుబాయ్ లో కొత్త ఆర్థిక చట్టాలను అమల్లోకి తెచ్చారు. వాటిని ఉల్లంఘించిన వారిపై ట్రావెల్ బ్యాన్‌లు, ఆస్తుల సీజ్ వంటి తీవ్రమైన చర్యలను చేపట్టనున్నారు. ఫైనాన్షియల్ ఆడిట్ అథారిటీ డైరెక్టర్ జనరల్‌కు దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి ఉద్యోగులపై అనేక చర్యలు తీసుకునే అధికారం చట్టం ద్వారా కల్పించారు. ఈ మేరకు అక్టోబర్ 30న కొత్త ఆడిటింగ్ చట్టాలకు సంబంధించి ఉత్తర్వులను దుబాయ్ పాలకుడు, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ జారీ చేశారు. ఫైనాన్షియల్ ఆడిట్ అథారిటీ స్థాపనకు సంబంధించి 2018 లా నెం. (4)లోని కొన్ని నిబంధనలను సవరించారు. అలాగే 2024 లా నంబర్ (24)ని జారీ చేసారు. అసలు చట్టంలోని 34, 35, 36 ఆర్టికల్‌లను కొత్తగా నిర్వచించారు. చిన్న ఉల్లంఘనలను క్రమశిక్షణా చర్యల ద్వారా పరిష్కరించవచ్చు. అయితే క్రిమినల్ నేరాలను దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు నివేదించాలి. ఇంకా ట్రావెల్ బ్యాన్‌లు, అసెట్ ఫ్రీజ్‌లు మూడు నెలల వరకు పొడిగింపులు వంటి చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేశారు. అదే సమయంలో సరైన కారణం లేకుంటే మూడు నెలల తర్వాత అప్పీలు చేయవచ్చు. కొత్త చట్టం అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుండి అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







