తొలిసారి రుషికొండ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు..
- November 02, 2024
విశాఖపట్నం: విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లిలో శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు రుషికొండ వెళ్లారు.రుషికొండలో నిర్మించిన భవనాలను చంద్రబాబు పరిశీలించారు.ప్యాలెస్ లో తిరుగుతూ నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు చంద్రబాబు.ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కార్యక్రమాలకు వాడుకోవాలి అనే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.దానికి సంబంధించి భవనాలను పరిశీలించాలని చంద్రబాబు అనుకున్నారు.ఇందులో భాగంగానే ఇవాళ ఆయన రుషికొండ చేరుకున్నారు. అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు.ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
ఈ భవనాలను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించింది. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. రుషికొండను మొత్తం తవ్వేసి నిర్మాణాలు చేస్తున్నారని వివాదం చెలరేగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రుషికొండ భవనాల వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఇప్పుడు ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేదానిపై చంద్రబాబు సర్కార్ సమాలోచనలు చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల