అకస్మాత్తుగా లేన్ మారడం తీవ్రమైన నేరం..కారు ప్రమాదాలపై హెచ్చరిక జారీ..!!
- November 03, 2024
అబుదాబి: అబుదాబి పోలీసులు కారు ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికను జారీ చేశారు. అకస్మాత్తుగా లేన్ మారడం తీవ్రమైన నేరం అని హెచ్చరించారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే 1,000 దిర్హామ్ జరిమానా విధించబడుతుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో అబుదాబి రోడ్ కెమెరాలకు చిక్కిన ఇటీవలి కారు ప్రమాదాలకు సంబంధించిన సీసీ ఫుటేజీని అబుదాబి పోలీసులు షేర్ చేసారు. ఆకస్మిక లేన్ మారడం కారణంగా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.
ఒక క్లిప్‌లో ఒక నల్లటి కారు వేగంగా ఆకస్మికంగా దాని లేన్ నుండి పక్కకు తిరుగుతూ పక్కనే ఉన్న మినీవ్యాన్‌ను, ఎదురుగా ఉన్న తెల్లటి కారును ఢీకొనడంతో డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. అయినా, దాని అధిక వేగం కారణంగా క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. మరో క్లిప్ లో నాల్గవ లేన్‌లో కదులుతున్న వ్యాన్‌ను గమనించడంలో విఫలమైన ఒక తెల్లటి కారు కూడా రోడ్డు మార్కింగ్‌లను దాటడం కనిపిస్తుంది. వ్యాన్ తర్వాత సెడాన్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్ సైట్ క్లియర్ గా లేని సమయంలో ఆకస్మిక రోడ్ మార్పు, ఓవర్‌టేకింగ్‌లను నివారించాలని అబుదాబి పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







