ఇంద్రకీలాద్రి పై గాజుల మహోత్సవం

- November 03, 2024 , by Maagulf
ఇంద్రకీలాద్రి పై గాజుల మహోత్సవం

అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గాజుల మహోత్సవం ఎంతో అట్టహాసంగా ఆదివారం ప్రారంభమైంది. ప్రతి ఏట నిర్వహించే గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారిని గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

వర్ణమాల రంగులతో కూడిన అందమైన గాజులతో ఆలయం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గాజుల అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ వారి దివ్య స్వరూపం దేదీప్యమానంగా వెలుగొందితోంది. వివిధ రకాల గాజులతో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు, ఉప ఆలయాలు, అమ్మవారి మూలవిరాట్ అను గాజులతో సుందరంగా అలంకరించారు.

ఆలయంలోనే మహా మండపం ఆరవ అంతస్తు లో అమ్మవారి ఉత్సవాల విగ్రహాన్ని ప్రత్యేకంగా గాజులతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న గాజుల మహోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వారాంతపు సెలవులకు తోడు కార్తీక మాసం ప్రారంభం, అమ్మవారు గాజుల అలంకరణలో ఉండడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద క్యూలైన్ లు పూర్తిగా నిండి ఉండే అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు కారులు రావడంతో కొండపై వాహనాలు బారులు తిని ఉన్నాయి.


అలాగే అమ్మవారికి తలనీలాలు సమర్పించుకునేందుకు భక్తులు కేశఖండన చాలా వద్ద క్యూ లైన్ లో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేశఖండనసాల వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఎదురుచూస్తున్నారు. భక్తుల రష్టి దృష్ట్యా ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ యు ఓకే ఎస్ రామారావు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈవో భక్తులతో మాట్లాడి ఏర్పాట్లు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ….

నదీ తీరంలో పుణ్యస్నానాలు..

కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానది తీరంలో పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఉన్న దుర్గా ఘాట్, పున్నమి ఘాట్ తో పాటు సీతమ్మ పాదాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. పుణ్యా స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వెళ్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com