ఖతార్ లో నేషనల్ ఏజింగ్ సర్వే ప్రారంభం..!!

- November 04, 2024 , by Maagulf
ఖతార్ లో నేషనల్ ఏజింగ్ సర్వే ప్రారంభం..!!

దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్, హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) సహకారంతో పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ  (MoPH) నిర్వహించే నేషనల్ ఏజింగ్ సర్వే కోసం ఫీల్డ్ వర్క్ అధికారికంగా ప్రారంభమైంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల ఆరోగ్యం, అవసరమైన సమాచారం అందించే లక్ష్యంతో ఫీల్డ్‌వర్క్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుంది. హెచ్‌ఎంసిలో దీర్ఘకాలిక సంరక్షణ, పునరావాసం వృద్ధాప్య సంరక్షణ డిప్యూటీ చీఫ్, నేషనల్ ఏజింగ్ సర్వే ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ హనాది అల్ హమద్ మాట్లాడుతూ.. “జాతీయ వృద్ధాప్య సర్వే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాలలో ఒక కీలక దశను సూచిస్తుంది. ఇది వారికి అందించే ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తపోటు, బరువు, వినికిడి,ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, అలాగే శారీరక మానసిక సామర్థ్యాల పరీక్షలు సర్వేలో భాగంగా నిర్వహిస్తారు. అలాగే వారి జీవనశైలి విధానాలపై సమాచారాన్ని సేకరిస్తారు.’’ అని అన్నారు. సర్వే, ఫీల్డ్ టీమ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం 16000 ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com