హమద్ టౌన్లో పడవల పార్కింగ్ పై ఆందోళన..!!
- November 04, 2024
మనామా: హమద్ పట్టణంలో తీరం నుండి మంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీధుల్లో పడవల పార్కింగ్ అనే పెద్ద సమస్యగా మారింది. ఇది స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. "పడవల పార్కింగ్ కారణంగా నేను నా కారును చేరుకోవడానికి అర కిలోమీటరు దూరం నడవాల్సి వస్తుంది. డాక్‌యార్డ్‌లో నివసిస్తున్నట్లు ఉంది." అని ఓ స్థానికులు వాపోయడు. ఇంటి పరిసరాలు బీచ్ లుగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బ్లాక్ 1205లోని రోడ్ 536లో కనీసం 30 ఇళ్ళు ఇప్పుడు డాక్యార్డ్లను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"పార్కింగ్ స్థలాలు చాలా తక్కువగా ఉన్నాయి. పెద్ద పడవలు పార్కింగ్ స్థలాలను ఆక్రమించడంతో మా కార్లను తరచుగా ఇంటికి దూరంగా పార్క్ చేయాల్సి వస్తుంది. పిల్లలు ఆడుకునే పరిస్థితి కూడా ఉండటం లేదు." అని కొందరు తెలిపారు. అయితే, బహ్రెయిన్ లో 1996 డిక్రీ నెం. 2 రోడ్డు ఆక్యుపెన్సీ చట్టం ప్రకారం.. ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించే లేదా ట్రాఫిక్‌ను నిరోధించే అడ్డంకులను సృష్టిస్తే, అలాంటి వారికి BD500 వరకు జరిమానా విధించబడుతుంది. అయినా ఈ చట్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇది కాగితాలకే పరిమితం అయిందని న్యాయవాది టాకీ హుస్సేన్ తెలిపారు. మరోవైపు మత్స్యకారులకు తీరప్రాంతం పరిమితంగా ఉండటంతో ఇళ్ల దగ్గర పార్కింగ్ తప్పనిసరి అని పలువురు బోట్ ఓనర్లు చెబుతున్నారు. పార్కింగ్ విషయంలో తరచూ గోడవలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ఇదిలా ఉండగా, ఉపయోగించని ప్రభుత్వ భూమిని తాత్కాలిక పడవ పార్కింగ్‌గా మార్చాలని నార్తర్న్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా అల్ ఖుబైసీ ప్రతిపాదించారు. అధికారులు స్పందించి పడవల పార్కింగ్ ను ఇళ్ల నుంచి దూరంగా ఉండేటట్టు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల