కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బుల్లెట్ ట్రైన్ & ఎక్స్‌ప్రెస్ హైవే!

- November 04, 2024 , by Maagulf
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బుల్లెట్ ట్రైన్ & ఎక్స్‌ప్రెస్ హైవే!

భారతదేశంలో నేషనల్ హైవేస్ మరియు బుల్లెట్ ట్రైన్లు అనేవి దేశ అభివృద్ధికి కీలకమైనవి. నేషనల్ హైవేస్ ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించి వాణిజ్య, రవాణా, పర్యాటక రంగాలకు మద్దతు ఇస్తే, బుల్లెట్ ట్రైన్లు వేగవంతమైన ప్రయాణాన్ని అందించి, సమయాన్ని ఆదా చేస్తాయి. ఇవి నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచి, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయి. 

అయితే దేశంలో బుల్లెట్ ట్రైన్ లు మరియు నేషనల్ హైవేస్ ను అభివృద్ధిపరిచే భాగంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బుల్లెట్ ట్రైన్ మరియు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుల గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్ట్: అన్ని అనుకూలిస్తే అనుకూలిస్తే ఈ ప్రాజెక్టు 2024లో ప్రారంభం కానుంది. ఇది పూర్తయిన తర్వాత, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం చాలా సులభం అవుతుంది. ఈ హైవే నిర్మాణం వల్ల ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలను కలిపే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్: ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు 2015లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం జపాన్‌తో కలిసి పనిచేస్తోంది. 2023 నాటికి 17% పనులు పూర్తయ్యాయి. భూసేకరణ సమస్యలు మరియు కరోనా మహమ్మారి కారణంగా ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. 

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బుల్లెట్ ట్రైన్ మరియు ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టులు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్మించబడుతున్న ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సుమారు రూ. 35,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 

ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత భారతదేశంలో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ హైవే నిర్మాణం పూర్తయిన తర్వాత, ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ప్రయాణం చాలా సులభం అవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com