ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- November 04, 2024
యూఏఈ: నవంబర్ 3న జరిగిన బిగ్ టిక్కెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్‌ని ప్రవాస భారతీయుడు ప్రిన్స్ కొలస్సేరి సెబాస్టియన్ గెలుచుకున్నారు. షార్జా ఉండే ఈ కేరళ ప్రవాసుడు జాక్‌పాట్ కొట్టడంపై సంతోషం వ్యక్త చేశాడు. ఇంత మొత్తాన్ని ఊహించలేదని, డబ్బుతో ఏమి చేయాలో మాకు అర్థం కాలేదని అని ప్రిన్స్ అన్నారు. 2015లో యూఏఈకి వచ్చిన ప్రిన్స్.. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి రాఫెల్స్‌లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరికి 2 మిలియన్ దిర్హామ్‌లు లభిస్తాయని చెప్పారు. ఆన్‌లైన్‌లో షో చూస్తున్న స్నేహితుడు మొదట నాకు కాల్ చేసి విషయం చెప్పాడని పేర్కొన్నాడు. తన స్వగ్రామంలో కొనసాగుతున్న తన ఇంటి నిర్మాణం కోసం డబ్బుల సమస్య తీరిందని చెప్పాడు. అలాగే తన పిల్లలను యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడ చదువు చెప్పిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







