రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ

- November 04, 2024 , by Maagulf
రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ

అమరావతి : కర్నూలులో కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలపై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖను రాశారు.గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్రంగా కలిచి వేస్తోంది.గతంలో ఎప్పుడో జరిగినా నా కారు ప్రమాదాన్ని.. నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చేయడం అత్యంత జుగుస్సాకరం. రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం అత్యంత దుర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెల్తే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి.. బయపడి నేను విదేశాలకు వెళ్లిపోయినట్టు దుష్ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అన్నారు.రాజకీయాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని విజయమ్మ లేఖ విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com