తప్పుడు మాదక ద్రవ్యాల కేసు.. 9 మంది అరెస్ట్..!!

- November 05, 2024 , by Maagulf
తప్పుడు మాదక ద్రవ్యాల కేసు.. 9 మంది అరెస్ట్..!!

కువైట్: డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ లోని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్.. నివాసిపై తప్పుడు మాదకద్రవ్యాల స్వాధీనం ఆరోపణ వివరాలను బయట పెట్టిందని చేసిందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సదరు నివాసి  మాజీ భార్య, ఒక అధికారి, అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సైనిక సిబ్బందితో సహా అనేక మంది వ్యక్తులు కలిసి కుట్ర చేసి తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేయించారని వెల్లడించారు.  ఒక అధికారి, ఇద్దరు పెట్రోలింగ్ అధికారుల సహాయంతో నివాసి వాహనంలో గుర్తించిన డ్రగ్స్‌ను రహస్యంగా, అతనికి తెలియకుండానే పెట్టినట్లు యాంటీ నార్కోటిక్స్ అధికారుల పరిశోధనలో వెల్లదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి నిందితుడు నేరంలో తమ పాత్రను అంగీకరించారని, తదుపరి చట్టపరమైన చర్యలు మరియు దర్యాప్తు పూర్తి కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com