గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది..
- June 24, 2016
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్ లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి.నిన్నటి వరకు పౌండుకు 1.50 డాలర్లు వస్తే, ఇప్పుడు కేవలం 1.35 డాలర్లు మాత్రమే వస్తున్నాయి. రూపాయి విలువతో పోల్చి చూసినపుడు కూడా పౌండు విలువ పడిపోయింది. నిన్నటి వరకు సుమారుగా ఒక పౌండుకు 98-99 రూపాయల వరకు వస్తుండగా, ఇప్పుడు 91.34 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. పౌండు విలువ పడిపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మీద కూడా దారుణంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటిషర్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ల మీద కూడా గట్టిగానే కనిపించింది. భారత స్టాక్ మార్కెట్ ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోగా జపాన్ మార్కెట్లలో అయితే 10 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







