యూఏఈలో మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహం..షేక్ మహమ్మద్
- November 05, 2024
యూఏఈ: అబుదాబిలో ప్రారంభమైన ప్రభుత్వ వార్షిక సమావేశాల సందర్భంగా యూఏఈ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహంలో స్థానిక, అంతర్జాతీయంగా డ్రగ్స్ డీలర్లు ప్రమోటర్లను గుర్తించి నిరోధించడం, బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయని తెలిపారు. సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు. ఈ మేరకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రకటించారు. "డ్రగ్స్ ఒక శాపం, నష్టం, ఒక వ్యసనం... ఒక భ్రమ సామాజిక క్యాన్సర్‌తో పోరాడేందుకు అందరూ కలిసి ఉండాలి." అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







