ఖతార్ లో సెలవులు.. అత్యవసర విభాగాల వర్కింగ్ అవర్స్ ప్రకటన..!!

- November 06, 2024 , by Maagulf
ఖతార్ లో సెలవులు.. అత్యవసర విభాగాల వర్కింగ్ అవర్స్ ప్రకటన..!!

దోహా: ప్రభుత్వ సెలవు దినాలలో తన సేవలకు సంబంధించిన అధికారిక పని వేళలను అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భద్రతా విభాగాలు,  ట్రాఫిక్ విచారణ 24 గంటలు పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో పేర్కొంది.

ఇదిలా ఉంటే, పాస్‌పోర్ట్‌లు, ట్రాఫిక్, జాతీయత, ప్రయాణ పత్రాలు, క్రిమినల్ ఎవడెన్స్,ఫింగర్ ప్రింట్ సమాచారంకు సంబంధించిన సేవా ఆధారిత విభాగాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది.

ఖతార్ శాశ్వత రాజ్యాంగానికి రాజ్యాంగ సవరణల ముసాయిదాపై సాధారణ ప్రజాభిప్రాయ సేకరణలో జాతీయ ఐక్యత ప్రదర్శనను పురస్కరించుకుని అమిరి దివాన్ నవంబర్ 6,  7 తేదీలలో అధికారిక సెలవులుగా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com