మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- November 07, 2024మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు.మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
అమరన్, లక్కీ భాస్కర్, ఇప్పుడు మట్కా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు..ఎలా అనిపిస్తోంది?
-చాలా హ్యాపీగా వుంది.దీపావళికి వచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా వుంది.మట్కా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకం వుంది.
-మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ గారికి అద్భుతమైన స్క్రిప్ట్ నాలెడ్జ్ వుంది.ఆయనకి ఉన్న డార్క్ ఫిలిం మేకింగ్ స్టయిల్ బ్రిలియంట్.మట్కా చాలా మంచి స్క్రిప్ట్. నాకు చాలా నచ్చింది. మట్కా తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది.
మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్ కి ఇస్తారా?
-నా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్ కి ఉంటుంది.తర్వాత డైరెక్టర్ గురించి కూడా ఆలోచిస్తాను.తను ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశారు? తన ఫిల్ మేకింగ్ స్టైల్ ఏమిటి, విజువల్ గా కథని ఎలా తీస్తారనేది కూడా చూస్తాను.
-కరుణ్ కుమార్ స్క్రిప్ట్ పరంగా, విజువల్ గా, టెక్నికల్ గా చాలా అద్భుతమైన డైరెక్టర్. చాలా హై బడ్జెట్ తో ఈ సినిమా గ్రాండ్ గా తీశారు. లక్కీ భాస్కర్, అమరన్ లానే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది.
మట్కా పిరియాడికల్ స్టోరీ కదా.. మ్యూజిక్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు?
-ఇది పిరియాడికల్ స్టోరీ.మ్యూజిక్ కూడా పిరియాడికల్ గానే ఉండాలి.ఆడియన్స్ ని ఆ టైమ్స్ లోకి తీసుకెళ్లాలి.ఈ విషయంలో మాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి.మోడరన్ సింథ్స్ వాడడం కుదరదు. పిరియాడిక్ టోన్ ని క్రియేట్ చేయడానికి ఆ తరహా మ్యూజిక్ ని సృష్టించాలి. ఆ టైమ్ పీరియడ్ కి ఆడియన్స్ ని మళ్లీ తీసుకురావాలంటే అలాంటి మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేయాలి. అది నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది.మట్కా గ్యాంగ్ స్టర్ ఫిలిం.వైలెన్స్, యాక్షన్, హై ఎమోషన్ వుంటుంది. ఇది గాడ్ ఫాదర్ తరహా సినిమా.
సినిమా చూసే వుంటారు కదా..ఎలా అనిపించింది?
-నేను సినిమా చూశాను.ఇది నైస్ యాక్షన్ ఫిల్మ్. అద్భుతమైన డైరెక్షన్, స్టొరీ,పెర్ఫార్మెన్స్ లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.కచ్చితంగా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
డైరెక్టర్ కరుణ కుమార్ గురించి?
-కరుణ్ కుమార్ చాలా అద్భుతమైన రైటర్.డార్క్ జోనర్ సినిమా చేయడంలో ఆయనదిట్ట. ఆయన సినిమాల్లో రా నెస్ ఉంటుంది.ఆయన కథలు నేచురల్ గా వుంటాయి.ఈ సినిమాలో కరుణ్ కుమార్ తో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు.బిగ్ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.
యాక్టర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉంటున్నారు..టైం ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
-నెలలో 12 రోజులు షూట్ చేస్తాను.మిగతా రోజులన్నీ మ్యూజిక్ లోనే ఉంటాను.రెండు నెలల ముందే షెడ్యూల్ చేసుకుంటాను.అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. మ్యూజిక్ విషయంలో అన్ టైం ఉంటాను.నా వర్క్ ని టైంకి డెలివర్ చేస్తాను,నేను ఎప్పుడూ లాస్ట్ మినిట్ వర్క్ చేయను.వారం రోజులు ముందుగానే అవుట్ ఫుట్ ఇచ్చేస్తాను.అందుకే నిర్మాతలు నాతో వర్క్ చేయడానికి హ్యాపీగా ఉంటారు.
- మ్యూజిక్ యాక్టింగ్ రెండిటిని సమానంగా ఆస్వాదిస్తాను. ఈ రెండిట్లోనూ లెర్నర్ గానే ఫీలవుతాను. ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతిరోజు ఒక విద్యార్థిగానే భావిస్తాను.
ఈ ఏడాది వందోసినిమా చేస్తున్నారు..అయినప్పటికీ ఒక స్టూడెంట్ గానే ఫీలవుతున్నాను అని చెప్తున్నారు..ఎలా?
-మ్యూజిక్ అనేది ఒక సముద్రం లాంటిది.ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి.ప్రతి సినిమా మనకి ఏదో కొత్త విషయాన్ని నేర్పుతుంది.అందుకే ప్రతిరోజు నేర్చుకోవడానికి ఇష్టపడతాను.
మీ 100 సినిమాల జర్నీ గురించి చెప్పండి?
నిజంగా ఇది గ్రేట్ జర్నీ.దేవుడి దయగా భావిస్తాను.యుగానికి ఒక్కడు, మద్రాస్ పట్నం, ఆకాశమే నీ హద్దురా, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా..ఇలా ఎన్నో జోనర్స్ లో సినిమాలు చేశాను.చాలా టైం లెస్ క్లాసిక్ సాంగ్స్ వచ్చాయి.ఈ జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చింది.ప్రతిసారి ఆడియన్స్ ని అలరించడానికి నా వంతు కృషి చేస్తాను.
మట్కాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి?
-రెట్రో జోన్ లో చేసిన లేలే రాజా సాంగ్ నాకు చాలా ఇష్టం.80స్ బ్యాక్ డ్రాప్ లో బప్పిలహరి స్టైల్లో చేసిన సాంగ్ అది.ఆ సాంగ్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది.
యాక్టర్ గా తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?
-నిజానికి 'దసరా'లో ఒక క్యారెక్టర్ నేను చేయాల్సింది.కానీ నా డేట్స్ కుదరలేదు.మంచి కథ, క్యారెక్టర్ వుంటే డెఫినెట్ గా చేస్తాను.
మీకు ఇష్టమైన జానర్ ఏంటి?
-నాకు లవ్ స్టోరీస్ చేయడం ఇష్టం.మంచి పాటలు చేయడానికి ఆ జోనర్ చాలా బాగుంటుంది. సెల్వ రాఘవన్ గారితో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను.
మీ 100 సినిమా గురించి?
- సుధా కొంగర గారితో నా వందో సినిమా చేస్తున్నాను. సినిమా అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!