ముందుగానే వేతనం పొందనున్న అబుధాబీ, దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులు!

- July 07, 2015 , by Maagulf
ముందుగానే వేతనం పొందనున్న అబుధాబీ, దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులు!

అబుధాబీ అధినేత, అధ్యక్షులు- హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఉపాధ్యక్షులు, యు. ఏ. ఈ. ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తమ విశేషాధికారాలను ఉపయోగించి, ఆగస్టు నెల అబుధాబీ మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్ ఉల్ ఫిత్ర్ కు ముందుగానే అంటే జులై 22 న వేతనాలివ్వవలసినదిగా ఆదేశించారు. హిజ్ హైనెస్ మొహమ్మద్ వారు- ఉద్యోగులు, వారి కుటుంబాలు  ఈద్ పర్వదినం సందర్భంగా వారి అవసరాల మేరకు వేతనాలు అందె లా వారి ఖాతాలో జమ చేయవలసిందిగా బ్యాంకులకు ఆదేశమిచ్చారని, తదనుగుణంగా ఆర్ధిక శాఖ కసరత్తును ప్రారంభించిందని దుబాయ్ ఆర్ధిక శాఖ డైరక్టర్ జనరల్ అబ్దుల్ రహ్మాన్ అల్ సలేహ్ తెలిపారు. 

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com