ఆ స్టార్ హీరో కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి!..వాస్తవమెంత?
- November 08, 2024
ఇప్పటివరకు మెగాస్టార్చిరంజీవి ఏ సినిమాలోను హీరోకి హీరోయిన్ కి తండ్రిగా కనిపించలేదు . ఆయన హీరోగా నటిస్తూ వచ్చాడే కానీ ఏ సినిమాల్లో కూడా ఆయన తండ్రి పాత్ర పోషించింది లేదు.
డ్యూయల్ రోల్ లో ఆయనే తండ్రి ఆయనే కొడుకుగా నటించారే తప్పిస్తే పక్క స్టార్ హీరోకి ఆయన తండ్రిగా కనిపించిన మూమెంట్స్ అస్సలు లేవు . అయితే మగధీర సినిమాలో అలా రామ్ చరణ్ కి తండ్రిగా కనిపించే ఛాన్స్ వచ్చినా కూడా చిరంజీవి ఒప్పుకోలేదు.
అప్పటి పరిస్థితులు వేరు కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్చిరంజీవి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోప్రభాస్ కి తండ్రిగా కనిపించబోతున్నాడట . ఆ సినిమా మరేంటో కాదు "స్పిరిట్". సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు . అయితే ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించే బాబుకి తండ్రిగా కనిపించబోతున్నాడట చిరంజీవి.
ఈ క్యారెక్టర్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అని సినిమాలో అసలు ప్రభాస్ కి ఫార్టీ పర్సెంట్ నటించే స్కోప్ ఉంటే.. ఈ క్యారెక్టర్ కి మాత్రం 60% నటించే స్కోప్ ఉంటుంది అని.. సినిమా మొత్తానికి చిరంజీవి క్యారెక్టర్ హైలైట్ గా మారిపోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ప్రెసెంట్ ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది. అయితే మరికొందరు మాత్రం ప్రభాస్ కన్నా కూడా నువ్వు చరణ్ కి తండ్రి గా కనిపిస్తే ఇంకా బాగుంటుందేమో అంటూ సజెస్ట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







