సినిమా రివ్యూ: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.!
- November 08, 2024
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా తెరకెక్కిన సినిమానే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. నిజానికి ఎప్పుడో రావల్సిన సినిమా ఇది. సడెన్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. స్లాట్ దొరకడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. అంతంత మాత్రం ప్రమోషన్సే.. మరి సినిమా ఎలా వుంది.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
రిషి (నిఖిల్ సిద్దార్ధ్’ చిన్పప్పటి నుంచీ రేసర్ కావాలని ఆశపడతాడు. ఆ క్రమంలోనే తారా (రుక్మిణీ వసంత్)ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు. ఓ చిన్న మిస్ కమ్యూనికేషన్.. వీరి ప్రేమ ఫెయిలవుతుంది. మధ్యలోనే ప్రేమించిన అమ్మాయిని వదిలేసి లండన్ వెళ్లిపోతాడు రిషి. అక్కడ మరో అమ్మాయి (దివ్యాంశ కౌశిక్), నిఖిల్‌ని ప్రేమిస్తుంది. మరి, ఈ ఇద్దరి ప్రేమయినా సక్సెస్ అయ్యిందా.? తారాను రిషి మర్చిపోయాడా.? ఈ లవ్ ట్రాక్ పక్కన పెడితే, లండన్‌లో లోకల్ డాన్ అయినటువంటి బద్రి నారాయణ్ (జాన్ విజయ్)కీ, అతని రైట్ హ్యాండ్ అయిన మున్నా (అజయ్)కీ మధ్య ఓ గొడవ. వీరిద్దరికీ ఇంపార్టెంట్ అయిన ఓ డివైస్ మిస్ అవుతుంది. ఇంతకీ ఆ డివైస్‌లో అంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏం దాగుంది.? ఆ గొడవలోకి రిషి ఎందుకు దిగాల్సి వచ్చింది.? రిషి లవ్ స్టోరీస్ ఏమయ్యాయ్.? ఈ కథ కంచికి ఎలా చేరింది.? తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
ఎప్పటిలాగే నిఖిల్ తనదైన పర్‌పామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హ్యాండ్‌సమ్ అండ్ యంగ్ లుక్స్‌లో ఆకట్టుకున్నాడు. కొత్తమ్మాయ్ రుక్మిణీ వసంత్‌కి ఈ సినిమా మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. ‘చీకట్లో చితక్కొట్టుడు’ తదితర సినిమాలతో సుపరిచితురాలైన దివ్యాంశ కౌశిక్‌కి ఈ సినిమాలో కాస్త పర్‌ఫామెన్స్ వున్న రోల్ దక్కింది. సుదర్శన్ తదితరులు తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. విలన్‌గా జాన్ విజయ్ రోల్ మొదట పవర్ ఫుల్‌గా చూపించినప్పటికీ చివరి వరకూ ఆ టెంపో కంటిన్యూ చేయలేదు. చీప్ అయిపోయింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
డైరెక్టర్ సుధీర్ వర్మతో ‘స్వామి రారా’ అనే బిగ్గెస్ట్ హిట్ ఆల్రెడీ నిఖిల్ కెరీర్‌లో వుంది. అయితే, లాంగ్ బ్యాక్ తర్వాత వచ్చిన ఈ సినిమాకీ, ఆ సినిమాకీ చాలా దగ్గర పోలికలున్నట్లు అనిపిస్తుంది. కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కథనం అంతకన్నా. చాలా స్లో నెరేషన్. స్లోగానే వున్నా.. థ్రిల్లర్ సినిమాలకు గ్రిప్పింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఈ సినిమాలో మిస్సయ్యాడనిపిస్తుంది డైరెక్టర్. కొన్ని చోట్ల పట్టున్నట్లుగా అనిపించిన సీన్లు కూడా చాలా లైట్‌గా తేల్చేశాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లండన్‌లో చూపించిన కొన్ని లొకేషన్లు చాలా బాగుంటాయ్. కానీ, సినిమాలో విషయం లేకపోయేసరికి తేలిపోయింది. ఎడిటింగ్‌కి చాలా పని చెప్పాల్సి వుంది. మ్యూజిక్ జస్ట్ ఓకే. ఒక్కటి మెచ్చుకోవల్సింది. ఎప్పుడో తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పటి నేటివ్‌కి మ్యాచ్ చేయడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నం రియల్లీ అప్రిషియేషన్. నిర్మాణ విలువలు బాగున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, వున్నంతలో సెకండాప్ కొద్దిగా చెప్పుకోదగ్గది. క్లైమాక్సే ఈ సినిమాకి ప్రాణం.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్, బోరింగ్ సన్నివేశాలు. రెగ్యులర్ అనిపించిన సీన్లు, పెద్దగా ఆకట్టుకోని డైలాగులు, పోలికలున్న సన్నివేశాలు.. ఆసక్తి రేకెత్తించని పాటలు,
చివరిగా:
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. థ్రిల్లరే కానీ, ఆ ఫీల్ ఎక్కడా కలగలేదు.!
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







