కొత్త తరహా దోపిడీ…అప్రమత్తం అంటున్న తెలంగాణ పోలీస్
- November 08, 2024
హైదరాబాద్: తెలంగాణలో సరికొత్త సైబర్ ఫ్రాడ్ కు కేటుగాళ్లు తెరలేపారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను తమకు అనుకూలంగా మార్చుకున్నారని, ఈ సర్వే పేరుతో లింక్ లు పంపించి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారని హెచ్చరించారు.
కుటుంబ సర్వే పేరుతో మొబైల్ ఫోన్ కు ఎలాంటి లింక్ వచ్చినా ఓపెన్ చేయొద్దని సూచించారు.ఒకవేళ ఈ లింక్స్ నిజమే అనుకుని క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము మొత్తం కాజేస్తారని చెప్పారు. దీంతో పాటు కుటుంబ సర్వే పేరుతో ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా స్పందించవద్దని సైబర్ పోలీసులు హెచ్చరించారు. సర్వే కోసం కాల్ చేశామని చెప్పి ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దన్నారు.
ఈనెల 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే కోసం అధికారులు, ప్రభుత్వ సిబ్బంది నేరుగా మీ ఇంటికే వస్తారని, వివరాలు నమోదు చేసుకుని వెళతారని సైబర్ పోలీసులు స్పష్టత నిచ్చారు. ఫోన్ ద్వారా, ఆన్ లైన్ లింక్ ల ద్వారా సర్వే చేయడం లేదని వివరించారు. ఈ సర్వే పేరుతో ఏదైనా లింక్ లు కానీ ఫోన్ కాల్ కానీ వస్తే స్పందించవద్దని సూచించారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







