మోకాళ్ల నొప్పులు నివారణకు..ఇలా చేస్తే సరి
- November 12, 2024
ఒకప్పుడు 60 ఏళ్ల, 70ఏళ్లు వచ్చాయంటే మొదలయ్యే సమస్యలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు.అయితే ఆధునిక జీవినశైలిలో మార్పులతో ఇప్పుడు మూడు పదుల వయసులోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వయసు పైబడిన వారు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. ఇందుకు ప్రధాన కారణం కీళ్ల దగ్గర తగినంత జిగురు లాంటి పదార్థం ఉండకపోవడం. దీన్ని అధిగమిస్తే ఎప్పుడైనా మోకాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మొదటి సమస్య ఏంటంటే ఉప్పు... రుచి కోసం ఉప్పు వేసుకుంటున్నాం, తప్పదు కనుక కొద్ది మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి శ్రేయస్కరం. రుచి కోసం చూస్తే, మీరు అధికంగా తినే ఉప్పు మోకాళ్లలో, కీళ్ల వద్ద జిగురు ఉత్పత్తి అవకుండా అడ్డుకుంటుంది. మనం అధికంగా తిన్న ఉప్పు బయటకు వెళ్లే అవకాశాలు తక్కువ. గతంలో లాగ శారీరక శ్రమ లేకుండా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాం. ఏసీలు, కూలర్లు పెట్టుకుని హాయిగా ఉంటాం. అలాంటప్పుడు మీరు తినే ఉప్పు కేవలం యూరిన్ రూపంలో బయటకు వెళ్లదు. దీంతో శరీరంలో పలు భాగాల్లో నిల్వ ఉండిపోయి మోకాళ్ల సమస్య అధికం అవుతుంది.
బెండకాయలో జిగురు ఉందని అది తింటే జిగురు వస్తుందని తింటుంటారు. నీ వీటివల్ల ప్రయోజనం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే జిగురు పదార్థాలు తింటే శరీరంలోని రక్తం జిగురు జిగురుగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఉప్పు అధికంగా తింటే మోకాళ్లు, కీళ్ల దగ్గర జిగురు అనేది రాకుండా ఉప్పుడు అడ్డుకుంటుంది, అప్పుడు కీళ్ల మధ్య రాపిడిలాగ అనిపించి మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. 30 ఏళ్లు, 40 ఏళ్లకు ఇప్పుడు కీళ్ల నొప్పులు రావడానికి ఇదే కారణం. మోకాళ్ల సమస్య నివారణకు ఈ చిట్కాలు పాటించాలి.
ఉప్పు ఎక్కువ తింటారు కనుక సోడియం శరీరంలో అలాగే ఉండిపోతుంది. ఎక్కువైన ఉప్పును దానికి అడ్డులేని చోట ఉంచుతుంది. కేవలం కీళ్ల సందులలో, చిన్న, పెద్దపేగు గోడలలో నిల్వ అవుతుంది.దీంతో మోకాళ్లు, కీళ్ల నొప్పులతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలా వస్తువులు ఉప్పు తాకితే డ్యామేజీ అవుతాయి. చెమట వచ్చేలా కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు, యోగా, లేక వ్యాయామం, జిమ్ లాంటివి చేస్తే స్వేదం ద్వారా లవణాలు బయటకు వెళ్లిపోతాయి. కీళ్లు దగ్గర జిగురు నిల్వ ఉండేందుకు దోహం చేస్తుంది. దాంతో లేచినా, కూర్చున్నా జిగురు ఉండటం వల్ల కీళ్ల రాపిడి తగ్గి మోకాళ్ల నొప్పులు రావు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!