మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
- November 12, 2024
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.ఈ మేరకు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో రోడ్ షోలలు, బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. పవన్‌తో పాటు మహారాష్ట్రకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెళ్లనున్నారు.ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు నాదెండ్ల. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 23న ప్రకటిస్తారు.
ఇకపోతే..ఇటీవల ఢిల్లీ లో హోం మంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలసిందిగా జన సీనానిని కోరారు.దీంతో పవన్ తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నారు మహారాష్ట్రలోని తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ నెల 16,17 తేదీల్లో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. కాగా, ఆ రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు ఆ ఇద్దరు నేతలు అందుబాటులో ఉండకపోవచ్చు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







